ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రామచంద్రపై దాడి ఘటనలో రాజకీయ కోణం లేదు: డీఎస్పీ - రామచంద్రంపై దాడి ఘటనపై డీఎస్పీ

రామచంద్రపై జరిగిన దాడి వెనుక రాజకీయ కోణం లేదని... మదనపల్లి డీఎస్పీ రవి మనోహరాచారి స్పష్టం చేశారు. పండ్ల బండి దగ్గర జరిగిన వివాదమే ఘర్షణలకు దారితీసినట్లుగా ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు విచారణ జరిపిన తర్వాత వెల్లడిస్తామని చెప్పారు.

రామచంద్రంపై దాడి ఘటనలో రాజకీయ కోణం లేదు
రామచంద్రంపై దాడి ఘటనలో రాజకీయ కోణం లేదు

By

Published : Sep 27, 2020, 9:54 PM IST

రామచంద్రంపై దాడి ఘటనలో రాజకీయ కోణం లేదు

చిత్తూరు జిల్లా బి.కొత్తకోటలో జస్టిస్ రామకృష్ణ సోదరుడు రామచంద్రపై జరిగిన దాడి వెనుక రాజకీయ కోణం లేదని మదనపల్లె డీఎస్పీ రవి మనోహరాచారి స్పష్టం చేశారు. పండ్ల బండి దగ్గర జరిగిన వివాదమే ఘర్షణకు దారితీసినట్లుగా ప్రాథమిక విచారణలో గుర్తించామన్నారు.

ప్రతాప్‌రెడ్డి, కుమార్‌రెడ్డి సహా నలుగురు నిందితులను గుర్తించామని, మరో ఇద్దరి వివరాల గురించి ఆరా తీస్తున్నామని చెప్పారు. బాధితుని నుంచి ఇప్పటివరకూ ఎటువంటి ఫిర్యాదూ అందలేదన్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు విచారణ జరిపిన తర్వాత వెల్లడిస్తామని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details