వర్షాభావ ప్రభావం.. దైవక్షేత్రంలో మోడుబారిన వనం - శ్రీకాళహస్తి
శ్రీకాళహస్తీశ్వరాలయానికి సమీపంలోని కైలాసగిరి పర్వతశ్రేణులు మోడుబారాయి. వర్షాభావ ప్రభావంతో ఎండిన చెట్లు దర్శనమిస్తున్నాయి.

వర్షాభావ ప్రభావం- దైవక్షేత్రంలో మోడుబారిన వనం
వర్షాభావ ప్రభావం- దైవక్షేత్రంలో మోడుబారిన వనం
శ్రీకాళహస్తీశ్వరాలయానికి సంబంధించి సుమారు 5 వేల ఎకరాల్లో విస్తరించిన కైలాసగిరి పర్వత శ్రేణుల్లో పచ్చదనం కనుమరుగైంది. ఈ వేసవి తీవ్రతతో చెట్లన్నీ మోడుబారాయి. మొక్కలన్నీ గిడసబారి పోయాయి. హరిత భరితంగా శోభిల్లే భరద్వాజ తీర్థం సమీప ప్రాంతం కళావిహీనంగా మారింది . దానికి తోడు ఉద్యానవన అధికారులు సరైన జాగ్రత్తలు చేపట్టడం లేదు. చిన్నపాటి నిప్పురవ్వ పడినా పెద్ద ఎత్తున ప్రమాదం జరిగే అవకాశం ఉంది.