ఎప్పుడు ఏ గ్రహణం వచ్చినా దాదాపు అన్ని దేవాలయాలు మూసివేస్తారు. గ్రహణం అనంతరం ఆలయశుద్ధి చేసి తిరిగి తెరుస్తారు. చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవాలయం ఇందుకు భిన్నం. గ్రహణం రోజు ఈ ఆలయం తెరిచేఉంటుంది.
గ్రహణ కాల సమయంలో దేశంలోని అన్ని ఆలయాల మూతపడినా.. రాహు కేతు సర్ప దోష నివారణ క్షేత్రంగా ప్రసిద్ధి గాంచిన శ్రీకాళహస్తీశ్వర ఆలయం మాత్రం తెరచే ఉంచుతారు. ఇక్కడ స్వామి వారు 27 నక్షత్రాలు, నవగ్రహాలను కవచంగా ధరించి ఉండడంతో ఎటువంటి గ్రహాణాలు ఈ ఆలయానికి వర్తించవు.