రాష్ట్రంలో లాక్డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న పేదలకు దాతలు సహాయం అందిస్తున్నారు. నిత్యావసరాలు, ఆహారం అందిస్తూ అభాగ్యుల ఆకలి తీరుస్తున్నారు.
చిత్తూరు జిల్లాలో
చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలో.. పలువురు దాతలు.. పేదలకు నిత్యావసర సరుకులు అందించారు. పలుచోట్ల జనసేన కార్యకర్తలు నిరుపేద కుటుంబాలకు 3 కిలోల బియ్యం, కూరగాయలు పంపిణీ చేశారు.
కృష్ణా జిల్లాలో
కృష్ణా జిల్లా తిరువూరులో పలువురు దాతలు పేదలకు తమవంతు సాయం అందిస్తున్నారు. నిత్యావసర వస్తువులు, కూరగాయలు పంపిణీ చేస్తూ అభాగ్యులకు అండగా నిలుస్తున్నారు. లయన్స్ క్లబ్ ప్రతినిధులు పట్టణ పరిధిలోని పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. తెదేపా నాయకుడు వెల్లంకి సురేంద్ర బాబు అంతర్రాష్ట్ర చెక్‌పోస్టుల వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసులకు భోజన వసతి ఏర్పాటు చేశారు. పట్టణంలోని అనాథాశ్రమంలోని వృద్ధులు, దివ్యాంగులకు పలువురు దాతలు ఆహారం అందిస్తున్నారు.
తూర్పుగోదావరిలో
తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఐటీడీఏ కార్యాలయంలో అవేర్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో లక్ష రూపాయలు విలువ చేసే శానిటైజర్లు, దుప్పట్లు, మాస్కులు తదితర సామాగ్రిని వైద్య సిబ్బందికి అందించారు.
ఇవీ చదవండి:
దేశవ్యాప్తంగా మే 17 వరకు లాక్డౌన్ పొడిగింపు