కరోనా నియంత్రణలో భాగంగా ఆదివారం రాత్రి ఇళ్లల్లో లైట్లు ఆపేసి, దీపాలు వెలిగించాలన్న ప్రధాని పిలుపును అనుసరించేందుకు ప్రజలు కొన్ని జాగ్రత్తలు పాటించాలని విద్యుత్ అధికారులు సూచిస్తున్నారు. అందరూ ఒక్కసారే లైట్లు ఆపేస్తే గ్రిడ్ పడిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇదే జరిగితే విద్యుత్‌ను పునరుద్ధరించేందుకు చాలా సమయం పడుతుందని తెలిపారు. కాబట్టి మోదీ పిలుపును పాటించే ముందు ఇంట్లోని ఏసీ, ఫ్రిజ్, ఫ్యాన్ వంటి ఇతర విద్యుత్ పరికరాలను ఆన్ చేసి ఉంచాలని సూచిస్తున్నారు. ఆ తరువాతనే లైట్లు ఆపాలని అంటున్నారు. అలాగే తిరిగి లైట్లు వేసే ముందు ఇంట్లోని ఇతర విద్యుత్ పరికరాలను ఆఫ్ చేయాలని చెబుతున్నారు ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ హరినాథరావు.
'మోదీ పిలుపును పాటించే ముందు జాగ్రత్తలు తప్పనిసరి'
కరోనా వైరస్‌పై ఐక్య పోరాటానికి గుర్తుగా ఏప్రిల్ 5న రాత్రి తొమ్మిది గంటలకు దేశవ్యాప్తంగా లైట్లను ఆర్పివేయాలని పిలుపునిచ్చారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. అయితే ఇందులో ప్రమాదం ఉందని.. విద్యుత్ గ్రిడ్ కుప్పకూలే అవకాశం ఉందంటున్నారు విద్యుత్ శాఖ అధికారులు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి ముప్పు ఉండదని సూచిస్తున్నారు.
lights off