ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఈ టీవీ భారత్ కథనానికి స్పందన.. రష్యన్ యువతికి దాతల సాయం

ఆధ్యాత్మిక యాత్రకని వచ్చి స్వదేశానికి వెళ్లడానికి డబ్బులు లేక తిరుపతిలో చిక్కుకున్న రష్యా యువతిపై ఈనాడు, ఈటీవీ, ఈటీవీ భారత్​లో వచ్చిన కథనానికి స్పందన లభించింది. యువతికి సాయం అందిస్తామని దాతలు ముందుకొస్తున్నారు.

donors help to russian lady stuck in tirupathi
రష్యా యువతి

By

Published : Jul 28, 2020, 2:23 PM IST

రష్యా యువతి దీనగాథపై ఈనాడు, ఈటీవీ, ఈటీవీ - భారత్​​లో వచ్చిన కథనం దాతలను కదిలించింది. దేశవిదేశాల నుంచి పలువురు ఫోన్లు చేసి తిరుపతిలో చిక్కుకుపోయిన రష్యన్ యువతికి అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. రష్యా వెళ్లేందుకు విమాన ఖర్చులు భరించేందుకు సిద్ధమని డాట్ ట్రావెల్స్‌ సంస్థ ముందుకొచ్చింది. మారమ్ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ రూ.25 వేలు సాయం ప్రకటించింది. రష్యన్‌ యువతికి తక్షణ సాయంగా రూ.10 వేలు అందించనున్నట్లు స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌ రెడ్డి వెల్లడించారు. తిరుపతి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ -తుడాకు చెందిన ఓ అధికారి కుటుంబసభ్యులు ఇప్పటికే నిత్యావసరాలు అందించారు. మరో ప్రభుత్వ అధికారి రూ.10 వేలు సాయం ప్రకటించారు.

ABOUT THE AUTHOR

...view details