కరోనా నియంత్రణలో భాగంగా అత్యవసర సేవలందిస్తున్న వారికి చిత్తూరు జిల్లా తంబళ్లపల్లెలో పలువురు దాతలు నిత్యావసరాలు పంపిణీ చేశారు. స్థానిక ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలందరూ ఇంట్లోనే ఉండి కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించాలని కోరారు.
దాతల దాతృత్వం... పేదలకు నిత్యావసరాలు అందజేత - చిత్తూరు జిల్లాలో లాక్డౌన్ ప్రభావం
రాష్ట్రవ్యాప్తంగా లాక్డౌన్ నిబంధన కట్టుదిట్టంగా కొనసాగుతోంది. ఈ నిబంధన కారణంగా ఉపాధి కోల్పోయిన వలసకూలీలు, పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీరి అవస్థలను గమనించి కొందరు దాతలు సహాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. వారికి తోచినంత తోడ్పాటును అందిస్తూ బాసటగా నిలుస్తున్నారు.
పేదలకు నిత్యావసరాలు అందజేత