తాళాలు వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా దొంగతనం చేస్తున్న ఘరానా దొంగను తిరుపతి క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం ఉదయం పదిన్నర గంటల సమయంలో అలిపిరి వద్ద ఉన్న గరుడ కూడలిలో అనుమానాస్పదంగా తిరుగుతున్న పసుపులేటి సాయి కుమార్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. అతని వద్ద నుంచి 389 గ్రామాల బంగారు, 30 వేల విలువచేసే ల్యాప్ టాప్ స్వాధీనం చేసుకున్నట్లు తిరుపతి క్రైమ్ అదనపు ఎస్పీ వెంకటేశ్వర నాయక్ వివరాలు తెలిపారు. సాయి కుమార్ వేలిముద్రలు పరిశీలించగా ఇతనిపై పలుపోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు అయ్యాయని వివరించారు. ఘరానా దొంగను అరెస్టు చేసిన సీఐ, ఎస్సైలకు రివార్డు ప్రకటిస్తామని తెలిపారు.
తాళం వేసి ఉన్న ఇంట్లో దొపిడీలు చేసున్న దొంగ అరెస్టు - ccs
పగటిపూట తాళాలు వేసి ఉన్న ఇళ్లల్లో దొంగతనాలు చేసే ఘరానా దొంగను తిరుపతి క్రైం పోలీసులు అరెస్టు చేశారు.
దొంగ అరెస్టు