ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కాణిపాక వినాయకునికి లక్ష అమెరికన్ డాలర్ల విరాళం - ప్రవాస భారతీయుడు భారీ విరాళం

కాణిపాక వరసిద్ధి వినాయక ఆలయానికి లక్ష అమెరికన్ డాలర్ల విరాళం అందింది. ఈ మొత్తాన్ని ఓ ప్రవాస భారతీయుడు దేవస్థాన ఖాతాలో జమ చేసినట్టు ఈవో తెలిపారు. వాటి విలువ రూ. 72,88,877 ఉంటుందని అధికారులు వివరించారు.

Donation of one lakh US dollars to Kanipaka Ganesha
కాణిపాక వినాయకునికి లక్ష అమెరికన్ డాలర్ల విరాళం

By

Published : Oct 28, 2020, 5:24 PM IST

చిత్తూరు జిల్లాలోని సుప్రసిద్ధ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయానికి ఓ ప్రవాస భారతీయుడు భారీ విరాళం అందించారు. దేవస్థాన చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా లక్ష అమెరికన్ డాలర్లను విరాళంగా ఆలయ ఖాతాలో జమచేశారు.

ఈ మొత్తం భారతీయ కరెన్సీతో పోలిస్తే రూ. 72,88,877 కు సమానమని ఈవో పేర్కొన్నారు. భక్తుని సూచన మేరకు అన్నదాన ట్రస్ట్​నకు 50 వేల డాలర్లను, గోసంరక్షణ ట్రస్టుకు 50 వేల డాలర్లను వినియోగించనున్నట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details