కరోనా భయంతో పెంపుడు కుక్కలకు మాస్కులు కడుతున్నారు చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ప్రజలు.. పెంపుడు జంతువులకు కరోనా సోకకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడంతోపాటు ఇంటి నుంచి బయటకు వెళ్లే సమయంలో విధిగా మాస్కులు ధరించడం అలవాటుగా మార్చుకున్నారు శ్రీకాళహస్తి ప్రజలు. తమ పెంపుడు కుక్కలపైన ప్రతేక శ్రద్ధ తీసుకుంటున్నారు. కుక్కలకు మాస్కులు కట్టి.. ఆ తర్వాతే బయటకు తీసుకొస్తున్నారు.
నాకేం తక్కువ.. నేనూ పెట్టుకుంటా మాస్క్ - శ్రీకాళహస్తిలో మాస్క్ పెట్టుకుంటున్న కుక్కలు న్యూస్
కరోనా ప్రభావం పెంపుడు జంతువులపైనా పడింది. ఓ కుక్క మాస్క్ ధరించింది. మనుషులే.. కాదు... నేనూ.. కరోనా రాకుండా జాగ్రత్తలు తీసుకుంటానంటోంది. ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించినా.. బలైపోవాల్సిందేనని చెప్పకనే చెబుతోంది.
![నాకేం తక్కువ.. నేనూ పెట్టుకుంటా మాస్క్ dog wearing mask](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6766264-752-6766264-1586701575032.jpg)
dog wearing mask