తిరుపతిలోని బాలాజీ కాలనీలో ఓ చిన్న కుక్కపిల్ల అటుగా వెళ్లే వాహన చక్రం కిందపడి చనిపోయింది. ఆ కుక్కపిల్ల అరుపు విని తన తల్లి ఎక్కడి నుంచో పరిగెత్తుకు వచ్చింది. బిగ్గరగా అరుస్తూ.. అటుగా వెళ్తున్న వారిపై దాడికి దిగింది. కొద్ది సేపటికి రక్తం మడుగులో ఉన్న తన పిల్ల చుట్టూ తిరుగుతూ అటు ఇటు కదుపుతూ.. కుక్కపిల్లకు అంటిన రక్తాన్ని శుభ్రం చేసింది. పైకి లేపేందుకు ప్రయత్నించింది. కానీ అప్పటికే ఆ చిన్ని కుక్క పిల్ల చనిపోయింది.
అమ్మ తనం... కంటనీరు పెట్టించింది - dog baby death in thirupathi news updates
అమ్మ ప్రేమ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఈ ప్రపంచంలో నిజాయితీ గల ప్రేమ ఉందంటే అది అమ్మ ప్రేమ మాత్రమే. అది స్వచ్ఛమైనది. నవమాసాలు మోసి కన్న బిడ్డకు, తల్లికి మధ్య ఉండే బంధం వర్ణణాతీతం. అది మనుషులకైనా.. మూగజీవాలకైనా ఒకటే. తన బిడ్డ చనిపోయిందని తెలిసి ఆ శునకం పెట్టిన శోకం అందరికీ కంట నీరు తెప్పించింది.

dog baby death in thirupathi
మరో పక్క ఇంకో బిడ్డ పాలకోసం తల్లిదగ్గరకు వచ్చి పాలు తాగుతోంది. ఓ వైపు ఒక బిడ్డకు పాలు ఇస్తూనే..చనిపోయిన మరో బిడ్డను బాధగా చూస్తూ ఉండిపోయింది. ఈ దృశ్యాలు చూసిన స్థానికులు కుక్క తల్లి పడుతున్న తపనను చూసి కంటనీరు పెట్టుకున్నారు.
ఇదీ చదవండి:రిక్షావాలా కథ: 8 రోజులు- 11 రిక్షాలు- 1100 కి.మీ.