వారిద్దరూ డాక్టర్లు.. దంపతులు. ఒకే విద్యను అభ్యసించారు.. కృషి, పట్టుదలతో ఒకే విధమైన ప్రపంచ రికార్డు సాధించారు డాక్టర్ కొల్లి రాజశేఖర్, డాక్టర్ భజన రజని. ఇటీవల యోగావరల్డ్ బుక్ ఆఫ్ రికార్డు పోటీలో ఇద్దరూ పాల్గొన్నారు. రజని.. ఉత్థాన ప్రిస్తాసన ఏకధాటిగా 29 నిమిషాల 10 సెకన్లు చేయగా, రాజశేఖర్.. ఉష్ట్రాసన 15 నిమిషాలు చేసి ప్రపంచ రికార్డు సాధించారు. జైపూర్‌లో ఇటీవల నిర్వహించిన ఆన్‌లైన్ పోటీలో వివిధ దేశాల నుంచి దాదాపు 200 మంది పాల్గొన్నారు. మొత్తం 8 మంది న్యాయనిర్ణేతలు వీరిని ఎంపిక చేశారు. వివిధ అంశాలలో పోటీలు నిర్వహించగా రాజశేఖర్, రజని తాము ఎంచుకున్న ఆసనాల్లో రికార్డు సాధించారు. గ్రూప్ పోటీలో భార్యాభర్తలు ఇద్దరూ కలిసి మండూకాసనం 20 నిమిషాలు చేసి రికార్డు సృష్టించారు. సంస్థ వారు సోమవారం తమకు ప్రపంచ రికార్డుకు సంబంధించి సర్టిఫికేట్‌ను ఇవ్వనున్నట్లు రాజశేఖర్ తెలిపారు.
యోగా, ఫిట్‌నెస్ శిక్షకులుగా
రాజశేఖర్‌ది అనంతపురం జిల్లా. రజనిది చిత్తూరు జిల్లా పలమనేరు. ఇద్దరూ నెల్లూరు నారాయణ మెడికల్ కళాశాలలో 2011 సంవత్సరం మాస్టర్స్ ఆఫ్ ఫిజియోథెరపీ చేశారు. రజని మాత్రం ఆయుర్వేద పంచఖర్మ సర్టిఫికెట్ కోర్సు అదనంగా చేశారు. ఇద్దరి నడుమ బంధుత్వం ఉన్నందున పెద్దల సమక్షంలో 2013లో పెళ్లి చేసుకున్నారు. 2014 సంవత్సరం కేరళ రాష్ట్రంలోని అలువాలో యోగా కోర్సులు చేశారు. అంతకు మునుపే 2011 సంవత్సరం పట్టణంలో ఫిట్‌నెస్ శిక్షకులుగా ఉంటూనే కేరళలో యోగా శిక్షణ పూర్తిచేశారు. అనంతరం ఇద్దరూ యోగా, ఫిట్‌నెస్ శిక్షకులుగా పట్టణంలో తమ వృత్తిని కొనసాగిస్తున్నారు.
నాట్యంలోనూ ప్రవేశం