చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలంలోని కె.కె పేటలో జులై 27 న విశ్రాంత డాక్టర్ క్రిష్ణవేణమ్మ హత్య కేసులో ముద్దాయి వేముల విశ్వనాధాన్ని కల్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిపై గతంలో పలు కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బంగారు ఆభరణాలకోసమే.. హత్యచేసినట్లు ముద్దాయి వేముల విశ్వనాధం ప్రాధమిక విచారణలో తెలిపాడు. 86గ్రాముల బంగారు ఆభరణాలను, హత్యకు ఉపయోగించిన కత్తిని, ఒక స్కూటర్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదుచేసి ముద్దాయిని రిమాండుకు పంపించారు. ఈ కేసును త్వరితగతిన పూర్తిచేసిన సిబ్బందిని చిత్తూరు డీఎస్పీ హనుమంత రెడ్డి అభినందించారు.
'బంగారు ఆభరణాల కోసమే వైద్యురాలిని హత్యచేశాడు' - చిత్తూరు జిల్లాలో వైద్యురాలి హత్య
జులై 27న జరిగిన విశ్రాంత వైద్యురాలు క్రిష్ణవేణమ్మ హత్య కేసులో ముద్దాయిని కల్లూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బంగారు ఆభరణాలకోసమే వైద్యురాలిని హత్య చేసినట్లు విచారణలో నిందితుడు విశ్వనాధం తెలిపాడని పోలీసులు వెల్లడించారు.
doctor murder