చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో తాజాగా రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో... ఇక్కడ మొత్తం కేసుల సంఖ్య 49కి చేరింది. ఈ నేపథ్యంలో కలెక్టర్ భరత్ నారాయణ గుప్తా ఇక్కడ పరిస్థితిని సమీక్షించారు. లాక్డౌన్ అమలు, పారిశుద్ధ్య విధానం గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఏరియా ఆసుపత్రికి చేరుకొని సాధారణ ఓపీ విధానం, కరోనా ఐసోలేషన్ గది వివరాలు, తీసుకుంటున్న జాగ్రత్తలపై ఆరా తీశారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు చేపట్టాల్సిన చర్యలు గురించి అధికారులకు పలు సూచనలు చేశారు.
శ్రీకాళహస్తిలో పరిస్థితిని సమీక్షించిన కలెక్టర్ - srikalahasti corona cases news update
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో కరోనా మహమ్మారి రోజురోజుకు వ్యాపిస్తుంది. కలెక్టర్ భరత్ నారాయణ గుప్తా అక్కడ పరిస్థితిని పరిశీలించారు. కరోనా వ్యాప్తిని నివారించేందుకు అధికారులకు పలు సూచనలు చేశారు.

శ్రీకాళహస్తిలో పరిస్థితి సమీక్షించిన కలెక్టర్
Last Updated : May 1, 2020, 6:27 PM IST