చిత్తూరు జిల్లా మదనపల్లెలో అయ్యప్పస్వామి సేవాసమితి సభ్యులు వలస కూలీలకు బియ్యం, నిత్యావసరాలు పంపిణీ చేశారు. పట్టణంలోని వీవర్స్ కాలనీకి పలు ప్రాంతాల నుంచి వలస వచ్చిన కూలీలు లాక్డౌన్ కారణంగా ఉపాధి కరవై ఇబ్బందులు పడుతున్నారు. విషయం తెలుసుకున్న సేవా సమితి సభ్యులు 35 కుటుంబాలకు సరకులు అందించారు. ఈ విపత్కర పరిస్థితుల్లో పేదలను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని కోరారు.
మదనపల్లెలో వలస కూలీలకు నిత్యావసరాల పంపిణీ - lockdown
కరోనా వ్యాప్తి నిరోధానికి రాష్ట్రవ్యాప్తంగా లాక్డౌన్ కట్టుదిట్టంగా అమలవుతోంది. ఈ నేపథ్యంలో ఉపాధి కోల్పోయి పేదలు, కూలీలు, వలసకార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీరికి సహాయం అందించేందుకు పలువురు దాతలు ముందుకు వచ్చి.. వారికి చేయూత అందిస్తున్నారు.
వలస కూలీలకు బియ్యం, నిత్యావసర వస్తువుల పంపిణీ