దేశంలోనే తొలిసారిగా తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ తుడా ఉచితంగా మొక్కలను పంపిణి చేసింది. పర్యావరణ పరిరక్షణకు తోడ్పతుందని తితిదే పాలకమండలి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. తిరుచానూరులోని పాఠశాలలో తుడా నిర్వహించిన ఉచిత మొక్కల పంపణీ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ తుడా ఛైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో కలిసి హాజరయ్యారు. ప్రతి కుటుంబానికి రెండు మొక్కలు పంపిణీ చేశారు.తితిదే చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పచ్చదనాన్ని పెంపొందించేలా సీఎం జగన్ ఆశయాలకు అనుగుణంగా దేశంలోనే తొలిసారిగా తుడా నిర్వహిస్తోన్న ఈ కార్యక్రమం అభినందనీయమన్నారు.
తుడా పరిధిలో ఉచితంగా మొక్కల పంపిణీ - తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉచిత మొక్కల పంపిణీ
దేశంలోనే తొలిసారిగా పట్టణాభివృద్ధి సంస్థ తుడా తన పరిధిలో ఉచితంగా మొక్కలను పంచి పెట్టింది. ప్రతి ఇంటికి నాలుగు మొక్కలను పంపిణీ చేసింది.
తిరుపతి పట్టణాభివృద్ది సంస్థ తుడా పరిధిలో ఉచితంగా మొక్కల పంపిణీ