ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రధానిగా మోదీకి ఏడేళ్లు.. సేవా కార్యక్రమాలకు సిద్ధంగా భాజపా నేతలు - essential needs distribution for poor at chitrtor

భాజపా ఆధ్వర్యంలో పేదలకు చిత్తూరు జిల్లాలో నిత్యావసర సరకుల పంపిణీకి చర్యలు తీసుకుంటున్నట్టు పార్టీ రాష్ట్ర మీడియా ప్రతినిధి కోలా ఆనంద్ తెలిపారు. చెట్లు నాటే కార్యక్రమాన్ని సైతం చేపడతామన్నారు.

groceries
groceries

By

Published : May 29, 2021, 8:48 PM IST

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని పేద ప్రజలకు.. భాజపా ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీకి పార్టీ నేతలు సిద్ధం చేశారు. నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా వరుసగా ఏడేళ్ల పాటు కొనసాగిన నేపథ్యంలో.. సేవా హి సంఘటన్ పేరుతో పేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్నట్లు.. పార్టీ రాష్ట్ర మీడియా ప్రతినిధి కోలా ఆనంద్ తెలిపారు.

నియోజకవర్గంలోని సుమారు 60 గ్రామాల్లో కోడిగుడ్లు, కూరగాయలు, నిత్యావసర సరుకులను పంపిణీ చేసేందుకు శ్రీకారం చుట్టామన్నారు. ఆదివారం పెద్ద ఎత్తున మొక్కలు నాటడంతో పాటు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం చేపడతామని ఆయన అన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details