ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పలమనేరులో అధికార, ప్రతిపక్షనేతల మధ్య ఉద్రిక్తత..

చిత్తూరు జిల్లా పలమనేరు మున్సిపల్​ ఎన్నికల్లో తెదేపా, వైకాపా కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. వైకాపా అభ్యర్థి పోలింగ్ కేంద్రంలోకి వెళ్లేందుకు ప్రయత్నించటంతో ఉద్రిక్తతకు దారి తీసింది.

dispute
పలమనేరులో అధికార,ప్రతిపక్షనేతల మధ్య ఉద్రిక్తత..

By

Published : Mar 10, 2021, 5:25 PM IST

పలమనేరులోని 4వ వార్డులో వైకాపా అభ్యర్థి పోలింగ్ కేంద్రంలోకి వెళ్లేందుకు యత్నించటంతో వాగ్వాదం జరిగింది. లోపలికి వెళ్లాలని యత్నించిన వైకాపా అభ్యర్థిని.. తెదేపా అభ్యర్థి అడ్డుకున్నారు. అయినా వినకుండా లోపలికి వెళ్తుండటంతో.. తెదేపా అభ్యర్థి కూడా ముందుకు కదిలారు. దీంతో వైకాపా కార్యకర్తలు.. పెద్ద ఎత్తున చేరుకుని తెదేపా అభ్యర్థి ని నిలువరించారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం నెలకొంది. రెండు వర్గాలకు సర్ది చెప్పిన పోలీసులు పరిస్థితిని అదుపుచేశారు. అక్కడే ఉన్న మాజీ మంత్రి అమర్ నాథ్ రెడ్డి.. వైకాపా నాయకులు చేస్తున్న దౌర్జన్యం పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details