సాంకేతికతను అందిపుచ్చుకోవటం ద్వారా... మహిళ సమస్యలను దూరం చేసేలా కృషి చేస్తున్నట్లు దిశ ప్రత్యేక అధికారి దీపికా పాటిల్ తెలిపారు. తిరుపతిలో జరుగుతున్న స్టేట్ పోలీస్ డ్యూటీ మీట్లో భాగంగా మహిళా భద్రత అంశంపై నిర్వహించిన సింపోజియంలో ఆమె పాల్గొన్నారు. గతంలో కంటే భిన్నంగా కేవలం 53 రోజుల్లోనే ఛార్జీషీట్ నమోదు చేయటంతో పాటు, మహిళలు వేధింపులకు గురికాకుండా ఉండేలా కళాశాల, విశ్వవిద్యాలయం స్థాయి నుంచే అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. దిశ ఎస్ఓఎస్ యాప్ ద్వారా మహిళలపై జరుగుతున్న నేరాలను నివారించగలుగుతున్నామని దీపికా పాటిల్ స్పష్టం చేశారు.
'సాంకేతికత ద్వారా మహిళల సమస్యల పరిష్కారానికి కృషి' - news updates of thirupathi
తిరుపతిలో జరుగుతున్న స్టేట్ పోలీస్ డ్యూటీ మీట్లో దిశ ప్రత్యేక అధికారి దీపికా పాటిల్ పాల్గొన్నారు. సాంకేతికత ద్వారా మహిళల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు ఆమె స్పష్టం చేశారు. దిశ యాప్ ద్వారా నేరాలు నివారిస్తున్నామని పేర్కొన్నారు.
దిశ ప్రత్యేక అధికారి దీపికా పాటిల్