రంగంపేట పశువుల పండగలో అపశ్రుతి.. పొడిచిన ఎద్దులు.. ముగ్గురికి తీవ్రగాయాలు - తిరుపతి జిల్లా తాజా వార్తలు
14:09 January 16
ఎ.రంగంపేటలో ఆంక్షలు లెక్కచేయకుండా వేడుకలు..ముగ్గురికి తీవ్ర గాయాలు
Bull Fight in A Rangampet: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ఎ.రంగంపేటలో పశువుల పండగ కన్నుల పండుగగా సాగింది. వేడుకలకు తిలకించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచే కాక.... తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున యువత హాజరై...... కోడె గిత్తలకు కట్టిన చెక్కపలకలను సొంతం చేసుకునేందుకు ఉత్సాహం చూపించారు. పశువుల పండుగలో వివిధ ప్రాంతాల నుంచి 100కు పైగా ఎడ్ల జతలు రాగా......30కి పైగా జల్లికట్టులో కోడెగిత్తలను పంపారు. కోడె గిత్తలను పట్టుకునే ప్రయత్నంలో పలువురు యువకులకు గాయాలయ్యాయి. పండగపై పోలీసులు ఆంక్షలు విధించినా....గ్రామస్థులు వాటిని పట్టించుకోలేదు.
ఇవీ చదవండి: