ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చిత్తూరు జిల్లాలో 20మంది కరోనా బాధితులు డిశ్ఛార్జ్ - చిత్తూరు జిల్లాలో కరోనా డిశ్ఠార్జ్ సంఖ్య

చిత్తూరు జిల్లాలో నేడు కొత్తగా కరోనా కేసులు నమోదు కాకపోవడంతో అధికారులకు కాస్త ఊరట లభించింది. నేడు ఆస్పత్రుల నుంచి 20 మంది డిశ్ఛార్జ్ అవడంతో... పోలీసులు, వైద్యసిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.

Discharge of 20 corona victims in Chittoor district
చిత్తూరు జిల్లాలో 20మంది కరోనా బాధితుల డిశ్ఛార్జ్

By

Published : May 6, 2020, 10:50 PM IST

చిత్తూరు జిల్లాలో బుధవారం కొవిడ్ ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి 20 మంది బాధితులు డిశ్ఛార్జ్ అయ్యారని అధికారులు ప్రకటించారు. చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి 8మంది, తిరుపతి రుయా ఆసుపత్రి నుంచి ఆరుగురు, స్విమ్స్ ఆసుపత్రి నుంచి మరో ఆరుగురు కోలుకుని ఇళ్లకు వెళ్లిపోయారు.

శ్రీకాళహస్తికి చెందిన 8 మంది, ఎర్రావారిపాలెంకు చెందిన ముగ్గురు, చిన్నగొట్టిగల్లు, తొట్టంబేడు, వరదయ్యపాలెం, తిరుపతి అర్బన్, బీఎన్ కండ్రిగ, ఏర్పేడు, పుత్తూరు, చంద్రగిరి, నిండ్రకు చెందిన ఒక్కొక్కరు డిశ్ఛార్జ్ అయ్యారు జిల్లాలో ఇప్పటివరకూ 82 పాజిటివ్ కేసులు నమోదు కాగా... కోలుకున్న వారి సంఖ్య 68కి చేరుకుంది.

ఇదీచదవండి.

కష్టకాలంలో పేదలకు అండగా నిలుస్తున్న దాతలు

ABOUT THE AUTHOR

...view details