చిత్తూరు జిల్లా చిన్నగొట్టిగల్లు మండలంలోని భాకరాపేట దివ్యాంగులు ఆందోళన బాటపట్టారు. ఈనెల 7న ఎర్ర వారి పాలెం మండలంలో అనసూయ అనే వికలాంగురాలిని హత్యాచారం చేసిన మునీంద్రను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ... తిరుపతి మదనపల్లి జాతీయ రహదారిపై నిరసన చేపట్టారు.
భాకరాపేటలో దివ్యాంగుల ధర్నా.. మునీంద్రను ఉరితీయాలని డిమాండ్ - Disabled protest
దివ్యాంగురాలిని హత్యాచారం చేసిన నిందితుడు మునీంద్రను ఉరి తీయాలని డిమాండ్ చేస్తూ.. చిత్తూరు జిల్లా మదనపల్లి జాతీయ రహదారిపై దివ్యాంగుల సంఘం నేతలు ఆందోళనకు దిగారు. రహదారిపై బైఠాయించి నిరసన తెలపడంతో రాకపోకలు స్తంభించాయి.
దివ్యాంగుల రక్షణ కోసం తీసుకువచ్చిన 92ఏ చట్టాలను కాకుండా.. నీరుగార్చే సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేయడంపై వికలాంగులు మండిపడ్డారు. హంతకుడికి న్యాయవాదులు సహకరించవద్దంటూ ప్రాధేయపడ్డారు.
రోడ్డుకు అడ్డంగా బైఠాయించి నిరసన తెలపడంతో భారీగా రాకపోకలు స్తంభించాయి. దీంతో భాకరాపేట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. వికలాంగులు అని చూడకుండా పోలీసులు లాగడంతో పోలీసులకు వికలాంగులకు స్వల్ప వాగ్వాదం జరిగింది. ఎఫ్ఐఆర్లో వికలాంగుల సెక్షన్ కూడా జతపరిచి.. కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో నిరసన కార్యక్రమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. డీఎస్పీ రవి మనోహర్ వికలాంగులకు నచ్చజెప్పడంతో నిరసన విరమించారు.