తిరుమలలోని దుకాణాల సముదాయం, తిరుమాఢవీధులను అనంతపూర్ రేంజ్ డీఐజీ క్రాంతి రాణా టాటా పరిశీలించారు. తిరుపతి అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డి, ఇతర సిబ్బందితో కలసి తనిఖీలు చేశారు.
కరోనా నిబంధనల అమలు తీరును తెలుసుకున్నారు. తిరుమాఢవీధుల్లో నవరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఆరాతీశారు. తిరువీధుల్లో వాహన సేవల నిర్వహణకు కల్పించాల్సిన భద్రతపై సూచనలు చేశారు.