తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున ధర్మ ప్రచారం చేస్తున్న భజన బృందాలను నిలిపివేయటాన్ని నిరసిస్తూ... తిరుపతిలో కళాకారులు ఆందోళన చేపట్టారు. తితిదే పరిపాలనా భవనం ఎదుట ప్రాచీన తెలుగు జానపద కళాకారుల సంఘం ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు.
తక్షణమే భజన బృందాలను ధర్మ ప్రచారంలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. నాలుగు రాష్ట్రాలకు సంబంధించిన 12 భజన బృందాల ఆధ్వర్యంలో లక్ష మంది కళాకారులు తిరుమల శ్రీవారి ధర్మ ప్రచారం చేస్తుంటే.. కొవిడ్ కారణంతో వారందరినీ నిలిపివేయటం అన్యాయమన్నారు. తితిదే ఈవో స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.