ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మదనపల్లిలో ధోని జన్మదిన వేడుకలు - dhoni fans celebrations

అక్కడి యువకులకు క్రికెట్ అంటే పిచ్చి.. ధోని అంటే ప్రాణం. ధోని పేరు, అతని జెర్సీ నంబర్ 7ని.. సాల్ట్ ఆర్ట్(ఉప్పు గల్లు) గా విభిన్న రంగుల్లో తీర్చిదిద్ది తమ అభిమానాన్ని చాటుకున్నారు. వారే చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన హెల్పింగ్ మైండ్స్ స్వచ్ఛంద సంస్థ సభ్యులు.

chittor district
మాదనపల్లిలో ధోని జన్మదిన వేడుకలు

By

Published : Jul 7, 2020, 9:10 PM IST

మదనపల్లిలోని హెల్పింగ్ మైండ్స్ స్వచ్ఛంద సంస్థ సభ్యుల ఆధ్వర్యంలో ధోని జన్మదిన వేడుకలు నిర్వహించారు. భారత క్రికెట్​కి ధోని అందించిన సేవలు మరువలేమన్నారు. అతను మళ్లీ ఫామ్ అందుకుని భారత జట్టులోకి రావాలని కోరుకుంటున్నామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రతిభా వంతులైన యువతకి ధోని రోల్ మోడల్ ఆయ్యారన్నారు.


మదనపల్లిలోని హెల్పింగ్ మైండ్స్ స్వచ్ఛంద సంస్థ సభ్యులు అబూ బకర్ సిద్దిఖ్ నేతృత్వంలో కేక్ కట్ చేసి... యువకులు తమ అభిమానాన్ని చాటుకున్నారు.

ఇదీ చదవండిమదనపల్లెలో తెదేపా నేతల ధర్నా

ABOUT THE AUTHOR

...view details