ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నేతమ్స్ షుగర్ ఫ్యాక్టరీ వద్ద రైతులు, కార్మికుల ధర్నా - nethams sugar factory latest news

చిత్తూరు జిల్లా నిండ్రలోని నేతమ్స్ షుగర్ ఫ్యాక్టరీ వద్ద రైతులు, కార్మికులు ధర్నా చేపట్టారు. రూ.36 కోట్లు పాత బకాయిలు చెల్లించాలని రైతులు ఆందోళన చేపట్టారు. నాలుగు నెలలుగా పెండింగ్‌లో ఉంచిన వేతనాలు చెల్లించాలని కార్మికులు డిమాండ్ చేశారు.

nethams sugar factory labours difficulties
నేతమ్స్ షుగర్ ఫ్యాక్టరీ వద్ద రైతులు, కార్మికుల ధర్నా

By

Published : Dec 1, 2020, 4:45 PM IST

చిత్తూరు జిల్లా నిండ్రలో నేతమ్స్ షుగర్ ఫ్యాక్టరీ వద్ద చెరుకు రైతులు, కార్మికులు ఆందోళన చేశారు. చక్కెర కర్మాగారం ప్రధాన ద్వారం వద్ద.. యాజమాన్యం తమ డిమాండ్లను నెరవేర్చాలని నినాదాలు చేశారు. రూ.36 కోట్ల మేర పేరుకుపోయిన బకాయిలను చెల్లించాలంటూ రైతులు వసతిగృహం వద్ద బైఠాయించారు. నాలుగు నెలలుగా పెండింగ్​లో ఉన్న వేతనాలు తక్షణమే చెల్లించాలంటూ కార్మికులు షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details