ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తిరుమ‌ల‌లో ముగిసిన ధ‌నుర్మాస పూజలు - తిరుమల వార్తలు

తిరుమలలో ధనుర్మాస పూజా కార్యక్రమాలు ముగిశాయి. నాద నీరాజన వేదికపై మార్గశిర విష్ణు వైభవ ప్రవచనంతో మొదలైన ఆధ్యాత్మిక కార్యక్రమాలు విష్ణు బిల్వ ప‌త్రార్చ‌నతో ముగిశాయి. వేదికపై మ‌హా విష్ణువు గా‌థ‌లైన‌ భాగ‌వ‌తం, విష్ణు పురాణం ప్రవచనాలు వినిపించారు.

Dhanurmasa Puja programs ended
ధ‌నుర్మాస పూజ కార్య‌క్ర‌మాలు

By

Published : Jan 14, 2021, 5:38 PM IST

తిరుమ‌ల నాద నీరాజన వేదికపై తలపెట్టిన ప‌విత్ర‌ ధ‌నుర్మాస పూజా కార్యక్రమాలు ముగిశాయి. డిసెంబ‌రు 15నుంచి మార్గశిర విష్ణు వైభవ ప్రవచనం, జ‌న‌వ‌రి 10 నుంచి శ్రీ విష్ణు బిల్వాప‌త్రార్చ‌న నిర్వహించారు. ఉద‌యం శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ శ్రీ‌నివాసుడిని, అనంత ప‌ద్మ‌నాభ స్వామివారి విగ్ర‌హ‌న్ని వ‌సంత మండ‌పంలో ఏర్పాటు చేశారు.

సాధార‌ణంగా శివునికి నిర్వహించే బిల్వాప‌త్రాల‌ పూజను ధ‌నుర్మాసం సందర్భంగా.. శ్రీ మ‌హా విష్ణువుకు జరిపారు. నాద నీరాజన వేదికపై శ్రీ మ‌హా విష్ణువు క‌థ‌లైన‌ భాగ‌వ‌తం, విష్ణు పురాణం ప్రవచనాలు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details