తెదేపా అధినేత చంద్రబాబుకు డీజీపీ గౌతమ్ సవాంగ్ లేఖ రాశారు. చిత్తూరు జిల్లా బి.కొత్తకోట ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వైకాపా నేతలు పథకం ప్రకారం దాడి చేశారనే ఆరోపణల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. ప్రతాప్‌రెడ్డి, పండ్ల వ్యాపారికి మధ్య దారి విషయంలో వాగ్వాదం జరిగిందని.. ఇద్దరి మధ్య వాగ్వాదం సమయంలో రామచంద్ర వెళ్లారని డీజీపీ తెలిపారు. ఆ సమయంలో రామచంద్రపై ప్రతాప్‌రెడ్డి దాడి చేశారని డీజీపీ లేఖలో పేర్కొన్నారు. ఘటనకు సంబంధించి పోలీసులు ఆధారాలు సేకరించారని డీజీపీ తెలిపారు.
న్యాయమూర్తి రామకృష్ణ సోదరుడిపై దాడి: చంద్రబాబుకు డీజీపీ లేఖ - బి. కొత్తకోట ఘటనపై వార్తలు
న్యాయమూర్తి రామకృష్ణ సోదరుడు రామచంద్రపై దాడి కేసు గురించి వివరణ ఇస్తూ.... తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబుకు డీజీపీ గౌతమ్‌సవాంగ్ లేఖ రాశారు. వైకాపా నేతలు పథకం ప్రకారం దాడి చేశారనే ఆరోపణల్లో వాస్తవం లేదని లేఖలో పేర్కొన్నారు. పోలీసులు ఆధారాలు సేకరించారని తెలిపారు.
బి.కొత్తకోట ఘటనపై చంద్రబాబుకు డీజీపీ లేఖ
Last Updated : Sep 29, 2020, 10:47 AM IST