తిరుమలలో స్వామి దర్శనానికి వేచి ఉన్న భక్తులు.. ప్రత్యక్ష నరకం అంటే ఏంటో చూస్తున్నారు. సర్వదర్శనం క్యూలైన్లో 3 కిలోమీటర్లకు పైగా బారులు తీరారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి లేపాక్షి కూడలి వరకూ లైన్ కట్టారు. శ్రీవారి సర్వదర్శనానికి 26 గంటలకు పైగా సమయం పడుతున్న కారణంగా.. తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. క్యూలైన్లలో అన్నపానీయాలు అందడం లేదంటూ ఆందోళనకు దిగారు. ఉక్కపోతతో వృద్ధులు, పిల్లలు ఇబ్బంది పడుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన చెందారు. అన్నపానీయాలు అందడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు.. వేసవి సెలవులు ముగుస్తుండడం, వారాంతం కారణంగా.. భక్తులు వేలాదిగా కొండకు తరలివస్తున్నారు. గదులు దొరకని పరిస్థితుల్లో.. తిరుమల వీధుల్లోనే ఆపసోపాలు పడుతున్నారు.
తిరుమలలో భక్తుల ఇక్కట్లు - devotes protest
తిరుమలలో స్వామి వారి దర్శనానికి 3 కిలో మీటర్ల మేర వేచిఉన్న భక్తులు ప్రత్యక్ష నరకాన్ని అనుభవిస్తున్నారు. అన్నపానీయాలు లేక ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోని ఆందోళనకు దిగారు.
తిరుమలలో భక్తులకు ప్రత్యక్ష నరకం