తిరుమల శ్రీవారి ఉచిత దర్శన టోకెన్ల జారీని తితిదే శనివారం నుంచి తిరిగి ప్రారంభించింది. తిరుపతి బాలాజీ లింక్ బస్టాండ్ భూదేవి కాంప్లెక్స్‌లో పది కౌంటర్ల ద్వారా భక్తులకు రోజూ 3 వేల టోకెన్లను ఇస్తున్నారు. ఒక రోజు ముందుగానే తీసుకోవాల్సి ఉండటంతో ఆదివారమిచ్చే టోకెన్ల కోసం శనివారం రాత్రి 10:30 నుంచే భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. సోమవారం దర్శనానికి ఆదివారం ఉదయం టోకెన్లు పొందారు. రాత్రంతా వీరు క్యూలైన్లలోనే ఇలా నిద్రించారు.
మదిలో నీవు.. నిద్రకేది తావు? - తితిదే
తిరుమల శ్రీవారి ఉచిత దర్శన టోకెన్ల జారీని తితిదే ప్రారంభించగా..భక్తులు టోకెన్ల కోసం బారులు తీరారు. రాత్రంతా వీరు క్యూలైన్లలోనే వేచిఉన్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం