ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తిరుమలకు పోటెత్తిన భక్తులు.. అలిపిరి చెక్​పోస్టు వద్ద వేలాది వాహనాలు - తిరుమల లేటెస్ట్​ అప్​డేట్స్​

తిరుమలకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. దీంతో.. అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద వేలాది వాహనాలు బారులు తీరాయి. దీంతో.. భక్తులు గంటల కొద్దీ వేచి ఉన్నారు.

tirumala
తిరుమలకు పోటెత్తిన భక్తులు

By

Published : Mar 19, 2022, 1:50 PM IST

Updated : Mar 19, 2022, 5:40 PM IST

తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తుండటంతో.. అలిపిరి తనిఖీ కేంద్రం వాహనాలు బారులు తీరాయి. తనిఖీలకు సమయం పడుతుండటంతో.. గంటల తరబడి భక్తులు వాహనాల్లోనే వేచి చూడాల్సిన పరిస్థితి తలెత్తింది. అధిక సంఖ్యలో భక్తులు సొంత వాహనాల్లో వస్తుండటం, వాటన్నింటిని తనిఖీలు చేయడానికి ఆలస్యమవుతోంది. ఫలితంగా.. రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది.

తిరుమల కనుమదారిలో కారు దగ్ధం..

తిరుమల కనుమదారిలో కారు దగ్ధమైంది. కర్నూలుకు చెందిన మహేశ్వర రెడ్డి, సుజాత దంపతులు కారులో కొండపైకి ప్రయాణిస్తున్న సమయంలో వాహనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన దంపతులు కారును పక్కకు ఆపి దిగిపోయారు. మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. చూస్తుండగానే నిమిషాల వ్యవధిలో కారు మొత్తం అగ్నికి ఆహుతైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.

తిరుమల కనుమదారిలో కారు దగ్ధం...

ఇదీ చదవండి:tirumala : తిరుమలకు వచ్చేవారికి ఈ నిబంధనలు తప్పనిసరి

Last Updated : Mar 19, 2022, 5:40 PM IST

ABOUT THE AUTHOR

...view details