తిరుపతిలో కోవిడ్ ఉద్ధృతి ఎక్కువ ఉండటంతో..శ్రీవారి సర్వదర్శన టోకెన్ల జారీని తితిదే నిలిపివేసింది. ఈ నెల 30 వరకు టోకెన్ల జారీ ఉండబోదని ప్రకటించింది. నేటి వరకు రోజుకు.. 3 వేల చొప్పున టికెట్లు జారీ చేశామని వెల్లడించింది. పక్క రాష్ట్రాలనుంచి తిరుమలకు వెళ్లిన భక్తులు ..ఏం చేయాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. గత నెల 29 నుంచి సర్వదర్శన టోకెన్లు జారీ చేస్తున్నారనే విషయం తెలుసుకుని పక్క రాష్ట్రాల నుంచి వేలాదిగా వచ్చిన భక్తులు...సర్వదర్శన టోకెన్ల జారీ నిలిపేస్తున్నట్లు అకస్మాత్తుగా ప్రకటించటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందుగా చెప్పి ఉంటే వచ్చేవాళ్లం కాదనీ, ఇప్పటివరకూ వచ్చినవాళ్లకు దర్శనం కల్పించి ఆపై టోకెన్లు నిలిపేయాలని కోరుతున్నారు. తితిదే అధికారులు స్పందించాలని భక్తులు విజ్ఞప్తి చేశారు.
సర్వదర్శన టోకెన్ల జారీ నిలిపివేతతో..భక్తుల ఆందోళన
తిరుపతిలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో అర్ధాంతరంగా... శ్రీవారి సర్వదర్శన టోకెన్ల జారీని దేవస్థానం నిలిపేయటంపై భక్తులు ఆందోళన చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం ఈటీవీ భారత్ ప్రతినిధి నారాయణప్ప అందిస్తారు.
తిరుమల సర్వదర్శన టోకెన్లు