శ్రీవారి గరుడసేవకు భక్తులు లక్షలాదిగా తరలివచ్చారు. నాలుగు మాడవీధులలో నిండిన భక్తుల రద్దీని క్రమబద్ధీకరించడం, ట్రాఫిక్ ని నియంత్రించడంలో పోలీసులు శ్రమిస్తున్నారు. గ్యాలరీల్లోకి వారిని అనుమతించకపోవటంతో రోడ్లపైనే కిక్కిరిసిపోయారు. మధ్యాహ్నం గంట పాటు వర్షం కురిసినప్పటికి ..వర్షంలోనే తడుస్తూ భక్తులు గ్యాలరీలోనే కూర్చున్నారు. లేపాక్షి, నందకం, మ్యూజియం వద్ద గ్యాలరీల్లోకి అనుమతించాలంటూ పోలీసులతో భక్తుల వాగ్వాదానికి దిగారు. ఎస్పీ అందు రాజన్ రహదారుల వెంట తిరుగుతూ ..సిబ్బందికి ఆదేశాలు జారీ చేయగా..భక్తుల తోపులాటకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. సైబర్ మిత్ర – మహిళా మిత్ర సిబ్బంది భక్తులకు సేవలు అందిస్తున్నారు.
శ్రీవారి గరుడ సేవకు భారీగా తరలివచ్చిన భక్తులు - Devotees flocked to Srivari Garuda Seva and police are trying to control the Devotees
శ్రీవారి గరుడసేవకు భక్తులు లక్షలాదిగా తరలివచ్చారు. పోలీసులు వారిని నియంత్రించేందుకు శ్రమించారు. వర్షం కురిసినప్పటికీ భక్తులు తడుస్తూనే గ్యాలరీలోనే ఎదురుచూస్తున్నారు.
Devotees flocked to Srivari Garuda Seva and police are trying to control the Devotees