చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో... స్వామి అమ్మవార్లకు నిర్వహించే ఉంజల్ సేవకు చెన్నైకి చెందిన భక్తుడు వెండి పీటలను విరాళంగా ఇచ్చారు. 15.668 కేజీల వెండితో వీటిని తయారు చేశారు. పీటల విలువ రూ.16.45 లక్షలు. ఆలయ ఈవో పెద్దరాజు, స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి... వారికి దగ్గర ఉండి స్వామి వారి దర్శనం చేయిపించారు. అనంతరం తీర్థ ప్రసాదాలను అందజేశారు.
శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి... వెండి పీటల విరాళం - శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి విరాళం
ప్రముఖ పుణ్య క్షేత్రం శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి... చెన్నైకి చెందిన నగల వ్యాపారి రూ.16.45 లక్షలు విలువ చేసే వెండి పీటలను కానుకగా సమర్పించారు. వీటిని స్వామి అమ్మవార్లకు నిర్వహించే ఉంజల్ సేవ కోసం ఉపయోగించనున్నారు.
చెన్నైకి చెందిన భక్తుడు వెండి పీటల విరాళం