చిత్తూరులో పోలీసుల నిర్బంధ తనిఖీలు.. నాటుసారా పట్టివేత - detension checks latest news update
చిత్తూరు జిల్లాలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. పాలసముద్రం మండలం ఎస్సీ కాలనీలో నాటుసారా విక్రయిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు 300 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. సారా తయారీకి సిద్ధం చేసిన వెయ్యి లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. సరైన ధ్రువపత్రాలు లేని 30 ద్విచక్ర వాహనదారులపై కేసు నమోదు చేశారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవలని సీఐ బాలయ్య హెచ్చరించారు.
పాలసముద్రంలో పోలీసుల నిర్బంధ తనిఖీలు