ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పంట నష్టంపై సత్వర సహాయక చర్యలు చేపట్టండి' - deputy cm latest updates

నివర్ తుపాన్ కారణంగా దెబ్బతిన్న రహదారులు, పంట నష్టాలపై సత్వరమే సహాయక చర్యలు చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి... చిత్తూరు జిల్లా కలెక్టర్ భరత్ గుప్తాను ఆదేశించారు.

ఫోన్ లో మాట్లాడుతున్న ఉపముఖ్యమంత్రి
ఫోన్ లో మాట్లాడుతున్న ఉపముఖ్యమంత్రి

By

Published : Nov 28, 2020, 10:59 PM IST

చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజక వర్గంలో ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి పర్యటించారు. వెదురుకుప్పం మండలంలో దెబ్బతిన్న రహదారులను పరిశీలించారు. తుపాను ధాటికి జరిగిన పంట నష్టంపై ఆరా తీశారు. కార్వేటి నగరం మండలం కృష్ణాపురం, పెనుమూరు మండలంలోని ఎన్టీఆర్ జలాశయాలను సందర్శించారు.

మిగులు జలాలను వెలుపలికి వదలడంతో రహదారులు కోతకు గురయ్యాయని అధికారులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. జరిగిన నష్టాన్ని ముఖ్యమంత్రికి వివరించి శాశ్వత పరిష్కారం లభించే విధంగా చర్యలు చేపడతామన్నారు. సత్వరమే సహాయక చర్యలు చేపట్టాలని కలెక్టర్ ను ఆదేశించారు.

ABOUT THE AUTHOR

...view details