తిరుమల శ్రీవారిని ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో ఉపముఖ్యమంత్రికి పండితులు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఉపముఖ్యమంత్రి , ఎంపీ - తిరుమల తాజా సమాచారం
తిరుమల శ్రీవారిని ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, రాజహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ దర్శించుకున్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి సంక్షేమ పథకాలను అందిస్తున్నారన్నారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఉపముఖ్యమంత్రి , ఎంపీ
ప్రపంచంలో ఎక్కడా లేనంతగా ప్రజలకు సంక్షేమపథకాలను ముఖ్యమంత్రి అందిస్తున్నారని.... అనేక ప్రాంతాల్లో ఆలయాలను నిర్మిస్తున్నారని నారాయణస్వామి తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేలా దేవస్థానం బోర్డు నిర్ణయం తీసుకుందన్నారు. తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణలపై ఆయన విమర్శలు చేశారు.
ఇదీ చదవండి:విగ్రహాల ధ్వంసంతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు: హోంమంత్రి