ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజా సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారని ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి వ్యాఖ్యానించారు. పేదవారి సొంతింటి కలను సాకారం చేసే దిశగా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. సంక్షేమ పథకాల అమలులో ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా అధికారులు పనిచేయాలని ఆదేశించారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి మాట్లాడుతూ... ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నవరత్నాలు-పేదలందరికి ఇళ్లు కార్యక్రమాన్ని అమలు చేస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు అవుతున్న వైఎస్ఆర్ జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
పేదవారి సొంతింటి కలను సాకారం చేస్తాం: ఉపముఖ్యమంత్రి - AP Latest News
పేదవారి సొంతింటి కలను సాకారం చేసే దిశగా సీఎం జగన్ కృషి చేస్తున్నారని... డిప్యూటీసీఎం నారాయణ స్వామి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న గృహ నిర్మాణ పథకం, ఆర్బీకేలు, గ్రామ సచివాలయాలు, వైఎస్ఆర్ హెల్త్ క్లీనిక్, బీఎంసీయు భవన నిర్మాణాల పురోగతిపై జిల్లా పరిషత్ సమావేశపు మందిరంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డితో కలిసి నారాయణస్వామి సమీక్ష నిర్వహించారు.
నారాయణస్వామి సమీక్ష