నిత్యం ప్రజాసేవ ధ్యేయంగా ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రి జగన్ను, తనను వేధింపులకు గురి చేస్తే రాజకీయ హీనులుగా మిగిలిపోతారని.. ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి అన్నారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పం మండలం పచ్చికాపల్లం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని.. జిల్లా వైద్య అధికారులతో కలిసి ఆయన సందర్శించారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్ర అభివృద్ధికి కృషి చేస్తానని వెల్లడించిన ఉప ముఖ్యమంత్రి.. ప్రజల్లో ప్రతిపక్ష నేత చంద్రబాబు తీరును ఎండగట్టారు. పదవుల కోసం సొంత వారిని వంచించిన వ్యక్తి చంద్రబాబు అని, ప్రజా సంక్షేమం ఏమాత్రం గిట్టని వ్యక్తని విమర్శించారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు మేలు చేస్తూ ముందుకు సాగుతున్న సీఎం జగన్ను విమర్శించడం సరికాదన్నారు. చంద్రబాబు హయాంలో ఎన్నో ఆలయాలను కూల్చివేసినా కొన్ని పత్రికలు గమనించలేకపోయాయని దుయ్యబట్టారు. మంత్రి పదవులపై ముఖ్యమంత్రిదే తుది నిర్ణయమని.. తామంతా ఆయన నిర్ణయాన్ని గౌరవిస్తామన్నారు.
ప్రజాసేవలో తనకు మంత్రి పదవులు అవసరం లేదని.. ఎమ్మెల్యేగా ఉన్నా తన నియోజకవర్గాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానన్నారు. కులాల మధ్య చిచ్చు రేపి.. రాక్షస ఆనందం పొందే పార్టీ తమది కాదని ఎద్దేవా చేశారు. అనంతరం ఆరోగ్య కేంద్రానికి దాతలు అందించిన వైద్య పరికరాలను.. వైద్యాధికారులకు అందజేశారు.
మమ్మల్ని వేధింపులకు గురిచేస్తే రాజకీయ హీనులుగా మిగిలిపోతారు: నారాయణస్వామి - ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి తాజా వార్తలు
ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు వెళుతున్న సీఎం జగన్ను, తనను వేధింపులకు గురిచేయటం సరికాదని.. ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి అన్నారు. తమను వేధించిన వారు రాజకీయ హీనులుగా మిగిలిపోతారని విమర్శించారు. పదవుల కోసం సొంత వారిని వంచించిన వ్యక్తి చంద్రబాబు అని, ప్రజా సంక్షేమం ఏమాత్రం గిట్టని వ్యక్తని విమర్శించారు.
'తమను వేధింపులకు గురిచేస్తే రాజకీయ హీనులుగా మిగిలిపోతారు': నారాయణస్వామి
TAGGED:
ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి