ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'నేతన్నలను అన్ని విధాలా ఆదుకుంటాం' - National Handloom Day

జాతీయ చేనేత దినోత్సవ జిల్లా స్థాయి సదస్సుకు ముఖ్య అతిథిగా ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో నేతన్నలు హాజరయ్యారు.

Deputy Chief Minister Narayanaswamy participated as Chief Guest at National Handloom Day District Level Conference at chittore district

By

Published : Aug 7, 2019, 7:32 PM IST

నేతన్నలను అన్ని విధాలా ఆదుకుంటాము..డీప్యూటీ సీఎం

చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం పెనుమూరు మండలం గొడుగుమానుపల్లెలో జరిగిన జాతీయ చేనేత దినోత్సవ జిల్లా స్థాయి సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నాగరికత నిర్మాణానికి చేనేత కార్మికులే ఆద్యులని పేర్కొన్నారు. చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని, ఏవైనా సమస్యలు ఉంటే అన్ని వేళలా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. నాగరికత అభివృద్ధి లో కీలక భూమిక పోషిస్తున్న నేతన్నలను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా డీప్యూటీ సీఎంకి పలువురు చేనేత కార్మికులు అభినందనలు తెలిపి సన్మానం చేశారు.

ABOUT THE AUTHOR

...view details