ఆరోగ్యశ్రీని హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాలకు విస్తరించటం శుభపరిణామమని ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి అన్నారు. చిత్తూరు జిల్లా తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో ఆయన ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రోగులకు అందుతోన్న వైద్యసేవలు, మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు. స్విమ్స్ ఆసుపత్రిని తితిదే పరిధిలోకి తీసుకురావడం వల్ల.. రాయలసీమలోనే ఆదర్శవంతమైన ఆసుపత్రిగా నిలవనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మెట్రో నగరాలకు ఆరోగ్యశ్రీ విస్తరించడం ద్వారా... సరిహద్దు జిల్లా అయిన చిత్తూరుకు ఎక్కువ మేలు చేకూరుతుందన్నారు. సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని రాష్ట్రంలో అమలు చేసి... అనారోగ్యాల బారిన పడకుండా ప్రజల్లో చైతన్యం తీసుకువస్తామని తెలిపారు.
'ఆరోగ్యశ్రీని మెట్రో నగరాలకు విస్తరించడం శుభపరిణామం'
ఆరోగ్యశ్రీని మెట్రో నగరాలకు విస్తరించడం శుభపరిణామమని ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి అన్నారు. తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో ఆయన ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
సమస్యలు అడిగి తెలుసుకుంటున్న ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి