ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 11, 2020, 3:27 PM IST

ETV Bharat / state

'ఆమె కేసులో నా పాత్ర ఉందని నిరూపిస్తే..రాజీనామా చేస్తా'

పెనమూరు వైద్యాధికారి అనితరాణి ఆరోపణల వెనుక తన పాత్ర ఉందని నిరూపిస్తే ..పదవికి రాజీనామా చేస్తానని ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి సవాల్ విసిరారు. ఆమె కేసులో తన పాత్ర లేదని తేలితే తెదేపా అధినేత చంద్రబాబు, లోకేష్ రాజకీయాల నుంచి తప్పుకుంటారా అని అని ఆయన ప్రశ్నించారు.

deputy chief minister  narayanaswamy conference on doctor anitharani in chittore
అనితరాణి కేసుపై నారాయణస్వామి మీడియా సమావేశం

అనితరాణి కేసుపై నారాయణస్వామి మీడియా సమావేశం

చిత్తూరు జిల్లా పెనుమూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి అనిత రాణి వ్యవహారంలో తన పాత్ర ఉందని నిరూపిస్తే.. తన పదవికి రాజీనామా చేస్తానని ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి అన్నారు. ఆమె కేసులో తన పాత్ర లేదని తేలితే తెదేపా అధినేత చంద్రబాబు, లోకేష్ రాజకీయాల నుంచి తప్పుకుంటారా? అని అని ప్రశ్నించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో ఎస్సీ కులాలకు ఎప్పుడూ న్యాయం చేయలేదని విమర్శించారు. కులాలను విడదీసిన, కుల వ్యవస్థను ప్రోత్సహించిన వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని.. తనను విమర్శించే అర్హత ఎవరికి లేదన్నారు. కారంచేడు ఎస్సీలపై దాడులు జరిగినప్పుడు చంద్రబాబు ఒక్క మాట కూడా మాట్లాడలేదని మండిపడ్డారు. ఎస్సీలకు ఇస్తున్న అసైన్డ్ భూముల పథకానికి స్వస్తి పలికిన ఘనత చంద్రబాబుదేనని విమర్శించారు. ఎస్సీ కులాల సంక్షేమానికి వైకాపా ప్రభుత్వం ఒక్కటే చర్యలు చేపట్టిందని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details