ఇదీ చూడండి:
'ప్రతి ఒక్కరికి విద్య అవసరం' - Deputy Chief Minister unveils Ambedkar statue at tkm peta
చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటినగరం మండలం టీకేయం పేటలో రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ విగ్రహావిష్కరణకు ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి హాజరయ్యారు. విశ్వ మేధావిగా గుర్తింపు పొందిన అంబేడ్కర్.. విద్యతోనే ఆ గౌరవాన్ని సాధించారని చెప్పారు. ప్రతి ఒక్కరికి విద్య అవసరమని అన్నారు. అందుకోసమే సీఎం.. పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడానికి చర్యలు చేపట్టారని వెల్లడించారు. సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం, చిత్తూరు ఎంపీ రెడ్డప్పలతో కలిసి ఆయన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాలలు వేసి జోహార్లు పలికారు.
అంబేద్కర్ కాంస్య విగ్రహావిష్కరణలో ఉప ముఖ్య మంత్రి నారాయణ స్వామి