ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎంజీఎన్​ఆర్ఈజీఏ పథకంతో గ్రామ అభివృద్ధికి కృషి చేయాలి - Minister Peddireddy Ramachandrareddy latest news

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కార్యక్రమాన్ని పల్లెల అభివృద్ధికి... సమర్థవంతంగా వినియోగించుకోవాలని ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి అన్నారు. కూలీల చెల్లింపుల్లో జరుగుతున్న జాప్యం, అవినీతిని సమూలంగా నిరోధించాలని అధికారులను సూచించారు.

Deputy Chief Minister Narayana Swamy
ఎంజీఎన్​ఆర్ఈజీఏ పథకంతో గ్రామ అభివృద్ధికి కృషి చేయాలి

By

Published : Dec 24, 2020, 3:45 PM IST

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని గ్రామాల అభివృద్ధి కోసం వినియోగించుకోవాలని ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి తెలిపారు. తిరుపతి శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో 5 జిల్లాల అధికారుల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మరో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కలిసి నారాయణ స్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పథకం అమలు తీరుతెన్నులపై మంత్రులు అధికారులతో చర్చించారు. కూలీల చెల్లింపుల్లో జరుగుతున్న జాప్యం, అవినీతిని సమూలంగా నిరోధించాలని ఆయా విభాగాధిపతులకు మంత్రులు సూచించారు.

ABOUT THE AUTHOR

...view details