కరోనా రెండో దశ కేసులు పెరుగుతున్నందన వీలైనంత త్వరగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి అభిప్రాయపడ్డారు. తిరుపతిలోని పద్మావతి కొవిడ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ధర్మగిరి వేదపాఠశాల విద్యార్థులను ఆయన పరామర్శించారు. కరోనా నుంచి ప్రజలను కాపాడటంలో వైద్యుల కృషి మరవలేనిదని, వారు దేవుళ్లని కొనియాడారు. కరోనా బారిన పడిన వారిని కుటుంబ సభ్యులు సైతం దూరంగా పెడుతున్న పరిస్థితులలో వైద్యులు అక్కున చేర్చుకొని సేవలందించడం అనిర్వచనీయమని అన్నారు.
'వీలైనంత త్వరగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలి' - MPTC, ZPTC elections
తిరుపతిలోని పద్మావతి కొవిడ్ ఆస్పత్రిని ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి సందర్శించారు. కరోనా రెండో దశ కేసులు పెరుగుతున్నందున వీలైనంత త్వరగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని ఆయన అభిప్రాయపడ్డారు.

ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి
TAGGED:
deputy cm narayana swami