ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Gadapagadapaku programme: ఉపముఖ్యమంత్రికి ప్రజల నుంచి నిరసన సెగ.. పరుష పదజాలంతో దూషిస్తూ - Chittoor

Deputy Chief Minister Gadapa Gadapa program: గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టిన ఉపముఖ్యమంత్రికి ప్రజల నుంచి నిరసన సెగ తగిలింది. అడుగడుగునా స్థానికులు ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ నిరసనలతో చిర్రెత్తిపోయిన ఉపముఖ్యమంత్రి పరుష పదజాలంతో ఊగిపోయారు. పరుష పదజాలంతో ధూషిస్తూ ఎస్సీలను నిందించారు.

Deputy Chief Minister
Deputy Chief Minister

By

Published : Apr 19, 2023, 8:56 AM IST

ఉపముఖ్యమంత్రికి ప్రజల నుంచి నిరసన సెగ.. పరుష పదజాలంతో దూషిస్తూ

Deputy Chief Minister Gadapa Gadapa program: గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టిన ఉపముఖ్యమంత్రికి ప్రజల నుంచి నిరసన సెగ తగిలింది. అడుగడుగునా స్థానికులు ప్రశ్నల వర్షం కురిపించారు. ఇలా అడుగడుగునా ప్రజల నుంచి ఎదురవుతున్న నిరసనలతో.. నిలదీతలతో చిర్రెత్తిపోయిన ఉప ముఖ్యమంత్రి కె నారాయణస్వామి పరుష పదజాలంతో ఊగిపోయారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం వెదురు కుప్పం మండలం కురివికుప్పం పంచాయతీలో.. గడప గడపకు మన ప్రభుత్వం పేరిట ఉపముఖ్యమంత్రి కె నారాయణస్వామి ఇంటింటి పర్యటన చేపట్టారు. మండల స్థాయి అధికారులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్న తీరును ప్రశ్నించారు.

అన్ని అర్హతలు ఉన్నా తమకు పక్కా ఇల్లు మంజూరు కాలేదని.. తమ గ్రామంలో మురుగునీటి కాలువలు లేవని.. తాగునీటి సమస్య తీర్చాలంటూ అడపాల బయలు గ్రామస్థులు ఉప ముఖ్యమంత్రిని కోరారు. తిమ్మిరెడ్డి కండ్రిగ ఆది ఆంధ్రవాడలో ఒకే కుటుంబంలో ఉద్యోగాల కోసం నెలకొన్న వివాదాల కారణంగా నాయకులు తనకు న్యాయం చేయలేదంటూ ఓ యువకుడు ఉప ముఖ్యమంత్రిని నిలదీశారు. యువకుడి చర్యలతో అసహనానికి గురైన మంత్రి మాట్లాడుతూ ఎస్సీ కాలనీలో ఏదైనా సమస్యలు ఉంటే వారే పరిష్కరించుకునే విధంగా నాయకులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉప ముఖ్యమంత్రి చేపట్టిన పర్యటనలో భాగంగా కురివి కుప్పంలో పలువురు మహిళలు మాట్లాడుతూ తమ గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని కోరారు. వీధులను ఆధునీకరించాలని యువకులు మంత్రిని కోరడంతో స్థానిక నేతలు కలగజేసుకొని వారించే ప్రయత్నం చేశారు. ఫీజు రీయింబర్స్​మెంట్​ అందలేదని.. ఓ విద్యార్థి మంత్రిని అడగడంతో కళాశాలకు నీ హాజరు తక్కువైనందువలనే నీకు పథకం వర్తించి ఉండదని సూచించి ముందుకు సాగారు.

కురివి కుప్పం ఎస్సీ కాలనీలో పర్యటించే క్రమంలో స్థానికులు రెవెన్యూ పరమైన సమస్యను తెలపడంతో.. వీఆర్వో సక్రమంగా విధులు నిర్వర్తించనందువల్లే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని.. వీఆర్వోను ప్రశ్నించి.. నువ్వు సెలవు పెట్టి వెళ్లిపో అంటూ ఆదేశించారు. అడగడుగునా సమస్యలపై కాలనీ వాసులు ప్రశ్నిస్తున్న తరుణంలో తీవ్ర అసహనానికి గురైన ఉపముఖ్యమంత్రి అక్కడ ఉన్న స్థానిక నేతలను మందలించారు. ఎస్సీ కాలనీకి దారి సౌకర్యం, బస్సు సౌకర్యం, నీటి సౌకర్యం, శ్మశానవాటిక కల్పించాలని తీవ్రస్థాయిలో ప్రశ్నించిన యువకుడిపై ఉప ముఖ్యమంత్రి విరుచుకుపడ్డారు. నేను ఎవరో తెలుసా అంటూ జాగ్రత్తలు తెలిపారు. మీ కుటుంబానికి ప్రభుత్వ పథకాలు అందుతున్నా టీడీపీ జెండాలు కట్టి ఏం చేస్తావంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పరుష పదజాలంతో దూషిస్తూ ఎస్సీలను నిందించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details