రాష్ట్ర ప్రభుత్వం మద్యాన్ని ఆదాయ వనరుగా చూడటం లేదని రాష్ట్ర అబ్కారీ శాఖ మంత్రి నారాయణ స్వామి అన్నారు. చిత్తూరు జిల్లా కల్యాణి డ్యాంలో శిక్షణ పొందిన నూతన ఎక్సైజ్ పోలీస్ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పోలీస్ శిక్షణా కళాశాలలో అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్, సబ్ ఇన్స్పెక్టర్లుగా శిక్షణ పూర్తి చేసుకున్న 42 మందికి మంత్రి ధ్రువపత్రాలు అందచేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, తుడా ఛైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సైతం హాజరై...శిక్షణ పూర్తి చేసుకున్న పోలీసులకు శుభాకాంక్షలు తెలియచేశారు. రాష్ట్రంలో దశల వారీగా మద్యపాన నిషేధం అమలు చేస్తామని మంత్రి తెలిపారు. తొలి దశలో బెల్టు షాపులను పూర్తిగా నిర్మూలిస్తామన్న ఆయన.....వారికి ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలను కల్పిస్తామన్నారు.
'రాష్ట్రంలో దశల వారీగా మద్యపాన నిషేధం'
మద్యపాన నిషేధం దశల వారీగా నిర్మూలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని అబ్కారీ శాఖ మంత్రి నారాయణ స్వామి తెలిపారు.
అబ్కారీ శాఖ మంత్రి నారాయణ స్వామి