చిత్తూరు జిల్లా తిరుపతిలోని హథీరాం మఠానికి చెందిన భూముల్లో అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. నగరంలోని ఉప్పరపల్లె హథీరాం మఠం భూముల అక్రమ నిర్మాణాలను జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా ఆదేశాలతో రెవెన్యూ అధికారులు జేసీబీలతో కూల్చివేత పనులను ప్రారంభించగా... స్థానికులు అడ్డుకున్నారు. తమకు ఏ మాత్రం ముందస్తు నోటీసులు ఇవ్వకుండా.. ఇళ్లను కూల్చేయటం అన్యాయమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తెదేపా జిల్లా అధ్యక్షుడు పులివర్తి నాని ఘటనా స్థలానికి చేరుకుని స్థానికులకు మద్దతు ప్రకటించారు. అనంతరం రెవెన్యూ అధికారులు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఇళ్లను కూల్చివేయటం సరికాదంటూ స్థానికులతో కలిసి అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ అధికారులు ఇళ్లను కూల్చివేశారు.
'తిరుపతి హథీరాం మఠంలో.. అక్రమ నిర్మాణాలు కూల్చివేత' - అక్రమ నిర్మాణాలు కూల్చీవేత
తిరుపతిలో హథీరాం మఠానికి సంబంధించిన భూముల్లో అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు కూల్చివేయటం... తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో రెవెన్యూ అధికారులు కూల్చివేత పనులను ప్రారంభించగా స్థానికులు అడ్డుకున్నారు. తెదేపా జిల్లా అధ్యక్షుడు పులివర్తి నాని ఘటనా స్థలానికి చేరుకుని స్థానికులకు మద్దతు ప్రకటించారు.
!['తిరుపతి హథీరాం మఠంలో.. అక్రమ నిర్మాణాలు కూల్చివేత'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4292832-859-4292832-1567188479830.jpg)
'తిరుపతి హథీరాం మఠంలోని అక్రమ నిర్మాణాలు కూల్చీవేత'
'తిరుపతి హథీరాం మఠంలోని అక్రమ నిర్మాణాలు కూల్చీవేత'
ఇది చూడండి: పాయకరావుపేటలో అక్రమ కట్టడాల కూల్చివేత