ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైద్యుల నిర్లక్ష్యం వల్లే బిడ్డ చనిపోయిందంటూ బంధువుల ఆందోళన

ఆపరేషన్ వికటించి పురిటి బిడ్డ మృతి చెందినట్లు బంధువులు ఆరోపించారు. ఇందుకు బాధ్యులైన ఆసుపత్రి యాజమాన్యంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన మదనపల్లెలోని ప్రైవేటు ఆసుపత్రిలో జరిగింది.

delivery baby died in madanapalle hospital and his family protest at hospital
పురిటి బిడ్డ మృతి పట్ల బంధువుల ఆందోళన

By

Published : Jun 8, 2020, 12:25 PM IST

చిత్తూరు జిల్లా మదనపల్లెలోని ప్రైవేటు ఆసుపత్రిలో పురిటిబిడ్డ చనిపోయింది. పుంగనూరువాండ్లపల్లికి చెందిన ముబారక్ బేగం (23) పురిటి నొప్పులతో పట్టణంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఆదివారం చేరింది. సాయంత్రం పురిటి నొప్పులు ఎక్కువ కావడం వల్ల మహిళా డాక్టర్ ఆపరేషన్ చేసుకోవాలని సూచించింది. అయితే అంత సమయం లేకపోవడం వల్ల సాధారణ కాన్పు చేస్తున్నట్లు ఆసుపత్రి సిబ్బంది బాధితురాలి తల్లిదండ్రులకు తెలిపారు. అనంతరం కొద్దిసేపటికే మగ బిడ్డకు బేగం జన్మనిచ్చింది. అయితే ఆ బిడ్డ అప్పటికే చనిపోయి ఉండటం, పురిటి బిడ్డకు గాయాలు ఉండటాన్ని బాధితురాలి కుటుంబ సభ్యులు గమనించారు. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం కారణంగా పురిటి బిడ్డ చనిపోయిందని బంధువులు ఆరోపించారు. ఆసుపత్రి సిబ్బందిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు బాధితురాలి బంధువులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details