అనంతపురం జిల్లాకు చెందిన వేణుగోపాల్... తిరుపతి శ్రీ గోవిందరాజు స్వామి డిగ్రీ కళాశాలలో బీఎస్సీ చదువుతున్నాడు. గత కొద్ది రోజులుగా స్నేహితులు ఎవరూ తనతో మాట్లాడడం లేదని... మనస్తాపం చెందిన వేణుగోపాల్ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన తోటి విద్యార్థులు ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలోనే ప్రాణాలు విడిచాడు. తాను ఎందుకు చనిపోతున్నది వేణుగోపాల్ సూసైడ్ నోటు రాసినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అన్నారు.
స్నేహితులు మాట్లాడటం లేదని... యువకుని ఆత్మహత్య - degree student crime news at tirupathi
స్నేహితుల కోసం చనిపోవడం... ఇది వరకు ఏ సినిమాలోనో చూసి ఉంటాం. కానీ ఇలాంటి ఘటనే తిరుపతిలో జరిగింది. తనతో ఎవరూ మాట్లాడడం లేదని ఓ విద్యార్థి తన మిత్రుల కోసం ఆత్మహత్య చేసుకున్నాడు.
మృతుడు వేణుగోపాల్